Vadde Naveen: బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న సీనియర్ స్టార్ హీరో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై భారీ అంచనాల మధ్య మొదలైంది బిగ్ బాస్.. అదే అంచనాల నడుమ ఇప్పటికే 5 సీజన్లు కూడా పూర్తిచేసుకొంది. ఇక ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ తో కొద్దిగా చేతులు కాల్చుకున్న నిర్వాహకులు ఈసారి ఎలాగైనా సీజన్ 6 ను హిట్ దిశగా పరుగులు పెట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి సీజన్ 6 లో బిగ్ బాస్ లోపలికి స్టార్లను పంపించడానికి ప్లన్స్ జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఇటీవల నాగార్జున సీజన్ 6 గురించి మాట్లాడుతూ .. ఈ సీజన్ లో బిగ్ బాస్ అభిమానులకు ఛాన్స్ ఉంటుందని, వారు తమ డీటెయిల్స్ తో బిగ్ బాస్ ను అప్రోచ్ అవ్వచ్చని తెలిపాడు. మరి ఈ సీజన్ అంతా సెలబ్రిటీలు కాకుండా నార్మల్ పీపుల్స్ ఉంటారా..? లేక సగం వారు సగం వీరు ఉంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే క్యాండిడేట్స్ వీరే అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా అందులోకి మరో స్టార్ హీరో వచ్చి జాయిన్ అయ్యాడు.
‘పెళ్లి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో వద్దే నవీన్.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా కొనసాగిన నవీన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం తన బిజినెస్ పనులను చూసుకుంటున్న నవీన్ కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ చేశారని సమాచారం. నవీన్ అప్పటి ప్రేక్షకులకే కాదు ఇప్పటి తరానికి కూడా సుపరిచితుడే. ఆయన సూపర్ హిట్ లవ్ సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటాయి. దీంతో నవీన్ రావడం బిగ్ బాస్ కు ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావించి, ఆయనను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!