Ashwin Babu: మెడికో థ్రిల్లర్ గా ‘వచ్చిన వాడు గౌతమ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin Babu: శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై అశ్విన్ బాబు, పాలక్ లాల్వాని జంటగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘వచ్చినవాడు గౌతమ్’. ఎం.ఆర్. కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.ఎస్.ఆర్. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత దామోదర ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తము సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకులు ఏ. యస్. రవి కుమార్, వి. సముద్ర, నటుడు రాజా రవీంద్రలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం నటుడు, చిత్ర నిర్మాత డి. యస్. రావ్ మాట్లాడుతూ, ”కరోనా తర్వాత అనేకమంది నిర్మాతలు సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని సినిమా తీస్తున్నాను. దర్శకుడు యం ఆర్. కృష్ణ చెప్పిన మెడికో త్రిల్లర్ కథ… హీరో అశ్విన్ బాబుకు, నాకు నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సురేష్ బాబు, కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయని చెప్పడంతో, ఈ కథను వారికి వినిపించి, బ్లెస్సింగ్స్ తీసుకుని మూవీని స్టార్ట్ చేస్తున్నాను. దర్శకుడు హీరో అశ్విన్ బాబును కొత్త కోణంలో చూపించ బోతున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతమ్’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మెదలు పెట్టి వైజాగ్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తాం. ఇందులో నాజర్, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, ఆర్జే హేమంత్, సంధ్యా జనక్, మాధవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక నుండి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తియ్యడానికి రెడీ అయ్యాను. త్వరలో ఒక యంగ్ హీరోతో కూడా సినిమా చేయబోతున్నాను” అని అన్నారు.
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..