Site icon NTV Telugu

AdiPurush: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. మరో వివాదంలో ఆదిపురుష్

Prabhas

Prabhas

AdiPurush: ఆదిపురుష్.. ప్రభాస్.. ఓం రౌత్.. బాలీవుడ్.. టాలీవుడ్ హీరో.. ప్రస్తుతం  సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి.  ఇప్పటివరకు ఆదిపురుష్ టీజర్ కానీ, పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదని గోల చేసినవారే.. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాకా ప్రభాస్ పోస్టర్ బాలేదని, రాముడ్ని అవమానించారని, బొమ్మల సినిమా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఈ సినిమాకు రాజకీయ రంగులు అద్దుతున్నారు. హనుమంతుడిని అవమానించారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది.

ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆదిపురుష్  మరో వివాదంలో చిక్కుకొంది. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ కొట్టారని వానర్ సేన స్టూడియో ఆరోపణలు గుప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టూడియో రిలీజ్ చేసిన శివ యానిమేషన్ పోస్టర్ ను కాపీ కొట్టి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేసారని చెప్పుకొచ్చారు. ఇక పోస్టర్లు రెండు ఒకేలా ఉన్నాయి. ప్రభాస్ రాముడి అవతారంలో విల్లు ఎక్కుపెట్టి గాల్లో తేలుతూ ఉండే ఈ పోస్టర్..  అచ్చు గుద్దినట్లు వారు డిజైన్ చేసిన శివ పోస్టర్ లానే ఉంది. “మేము రూపొందించిన శివ పోస్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. ఒరిజినల్ క్రియేటర్‌కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధకరం”అంటూ వానర్ సేన స్టూడియో అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తో ఆదిపురుష్ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. మరి ఈ వివాదంపై మేకర్స్ ఏమంటారో చూడాలి.

Exit mobile version