Site icon NTV Telugu

Ustad Bhagat Singh : డబ్బింగ్’లో బిజీగా పవన్ కళ్యాణ్

Ubs

Ubs

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్‌ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్‌ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ‘కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

Also Read:Chiranjeevi : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకరవరప్రసాద్ గారు’

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘దేఖ్‌ లేంగే సాలా’ గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం యొక్క నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను త్వరలోనే నిర్మాతలు వెల్లడించనున్నారు.

Exit mobile version