Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. వెయిటింగ్

Ustad

Ustad

Ustaad Bhagat Singh: ఏదైనా ఒక కాంబో ప్రేక్షకులకు నచ్చింది అంటే.. దాన్ని రీపీట్ గా కోరుకుంటూ ఉంటారు. ఇక ఆ కాంబో మళ్లీ రీపీట్ అవుతుంది అనగానే భారీ అంచనాలను పెట్టుకుంటారు. ఇక అలా ప్రేక్షకులకు నచ్చిన కాంబోలో ఒకటి పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబో లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్ల క్రితం సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబో.. ఇప్పుడు మరోసారి రిపీట్ కానుంది. పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే ఒక షెడ్యూల్ ను ముగించిన పవన్ .. కొద్దిగా గ్యాప్ తీసుకొని వారాహి విజయయాత్రలో పాల్గొన్నాడు. ఇక తాజాగా వారాహి విజయ యాత్రను పవన్ ముగించిన విషయం తెల్సిందే. దీంతో పవన్ షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Tejaswi Madivada : ఘాటు అందాలతో రెచ్చిపోయిన తేజస్వి..

గబ్బర్ సింగ్ షూటింగ్.. ఉస్తాద్ షూటింగ్ ఫొటోస్ ను కలిసి. అప్పటికీ .. ఇప్పటికీ.. హరీష్- పవన్ ల మధ్య ఉన్న బాండింగ్ మారలేదని చెప్పుకొచ్చారు. కొన్ని పనులు.. కొన్ని బాండింగ్స్ ఎప్పటికీ మారవు.. మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ హిట్ అందుకుంటాడా..? లేదా.. ? అనేది చూడాలి.

Exit mobile version