Site icon NTV Telugu

Ustaad: సిద్దు బాయ్ పరువు తీసేసిన మనోజ్.. కిస్ తోనే మొదలుపెడతావంట కదా అంటూ..

Siddu

Siddu

Ustaad: మంచు వారి చిన్నబ్బాయి ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కెరీర్ కు బ్రేక్ వేసిన మంచు మనోజ్ ఈ ఏడాది నుంచి మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఇక ఈసారి కొత్తగా సినిమాలతో పాటు.. బుల్లితెర హోస్ట్ గా కూడా మారాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు గేమ్ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇక మనోజ్.. ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే గేమ్ షో కు హోస్ట్ గా మారాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ షో లాస్ట్ వీక్ నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకు మొదటి గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని వచ్చాడు. మనోజ్.. నాని ఎపిసోడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా రెండో ఎపిసోడ్ కు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వచ్చి సందడి చేసాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు.

డీజే టిల్లు సాంగ్ తో సిద్దు ఎంట్రీ ఇచ్చి.. మనోజ్ తో స్టెప్పులు వేశాడు. ఇక ప్రోమో అంతా మనోజ్.. సిద్దును ఆడుకున్నట్లు కనిపిస్తుంది. మొదట స్క్రిప్ట్ పేపర్ మీద కిస్ అనే రాస్తావంటగా అని మొదలుపెట్టాడు మనోజ్.. ఇక సిద్దు సిగ్గుతోనే ముగ్గులు వేశాడు. ప్రతిదానికి నవ్వుతు సమాధానం చెప్పుకొచ్చాడు. ప్రపోజల్స్ ఏమి రాలేదు అంటే.. ప్రపోజల్స్ అయ్యేలోపు రా అని లాగేస్తాడు అని మనోజ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఇక ఒక గేమ్ షో లా కాకుండా మనోజ్ ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అలానే మాట్లాడిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక గేమ్స్ లో ఆసక్తిని పెంచేలా ఆడించిన విధానం.. ఎపిసోడ్ చూసేలా చేస్తోంది. మొత్తానికి ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఎపిసోడ్ లో సిద్దును మనోజ్ ఇంకా ఏ రేంజ్ లో ఆడుకున్నాడో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే

Exit mobile version