NTV Telugu Site icon

Ustaad: డీజే టిల్లు ను ర్యాంప్ ఆడిస్తున్న మంచు వారబ్బాయి

Manoj Siddu

Manoj Siddu

Ustaad: మంచు మనోజ్ రీఎంట్రీ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. కెరీర్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్.. ఈ ఏడాది గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా కాకుండా బుల్లితెరపై హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే ప్రోగ్రాంతో హోస్ట్ గా అడుగుపెట్టాడు. ఈటీవీ విన్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్గెస్ట్ సెలబ్రిటీ టాక్ షోగా ఉస్తాద్ స్ట్రీమ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ లో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశాడు. మనోజ్ చలాకీతనం, నాని పంచ్ లతో ఎపిసోడ్ మొత్తం దుమ్మురేగిపోయింది. ఇక నాని తరువాత ఉస్తాద్ లో ర్యాంప్ ఆడించడానికి వచ్చేస్తున్నాడు డీజే టిల్లు.

సిద్దు జొన్నలగడ్డ.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన సిద్దుకు డీజే టిల్లు స్టార్ డమ్ ను అందించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోల లిస్ట్ లో సిద్దును చేర్చింది. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారదు సిద్దు. ఇప్పటికే తనకు హిట్ అందించిన డీజే టిల్లు కు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ను రంగంలోకి దింపాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక సిద్దు.. ఉస్తాద్ షోలో సందడి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మనోజ్,సిద్దు కలిసి డీజే టిల్లు స్టెప్ వేస్తున్న పోస్టర్ ను షేర్ చేశారు. డిసెంబర్ 21 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి డీజే టిల్లు ను మంచు వారబ్బాయి ఎలా ర్యాంప్ ఆడించాడో చూడాలి.