Ustaad Bhagat Singh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రతిసారి ఫ్యాన్స్ పాడుకుంటూ ఉంటారు.. కానీ, ఈసారి మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ పాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ ముందు హరీష్ శంకర్ తో పవన్.. ఒక సినిమా ఉంటుందని ప్రకటించారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పుకొచ్చారు. ఇంకొన్ని రోజులకు అది తేరి రీమేక్ అన్నారు. ఆ తర్వాత సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యింది అన్నారు. పోస్టర్లు మారాయి, టైటిల్స్ మారాయి.. రోజులు గడిచాయి కానీ ఈ సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లలేదయ్యా. ఎన్నాళ్ళు.. ఎన్నాళ్ళు ఎదురుచూడాలి అని అభిమానులు హరీష్ శంకర్ ను అడిగి అడిగి విసిగిపోయారు. ఇక ఇప్పటికి హరీష్ తో పాటు పవన్ మనసు కూడా కరిగింది. కాదు కాదు.. పవన్ డేట్స్ దొరికాయి. అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Mahesh Babu: ఓ.. అన్నా.. అమృతమేమైనా తాగుతున్నావా.. ఏంటీ ఈ అందం
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కోలీవుడ్ సూపర్ హిట్ అందుకున్న తేరి.. అదేనండీ తెలుగులో పోలీసోడు సినిమాకు ఇది రీమేక్. అయితే రీమేక్ లైన్ మాత్రమే తీసుకున్నారని, మిగతాది అంతా తెలుగు నేటివిటీకి, ఫ్యాన్స్ కు నచ్చినట్లు తీయనున్నట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ బిగిన్ అయ్యినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగానే.. పవన్ పోస్టర్ ను డిజైన్ చేసి రిలీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో పవన్ ఒక చైర్ లో కూర్చొని ఒక చేత్తో గన్ ను ఇంకో చేత్తో టీ గ్లాస్ ను పట్టుకొని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ముఖం చూపించకుండా వెనుక భాగాన్ని చూపించి మరింత ఆసక్తిని రేపారు. ” ఈసారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు..” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే గబ్బర్ సింగ్ గుర్తుకురాక మానదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పవర్ హౌస్ తో హరీష్ బాక్సాఫీస్ ను ఎలా పేలుస్తాడో చూడాలి.
The POWER HOUSE has arrived to set ablaze USTAAD sets ❤🔥
ఉస్తాద్ ఊచకోత షురూ 💥#UstaadBhagatSingh shoot begins 🔥@PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/46Arw8lssq
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
