Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది పవన్ మూడు చిత్రాలు నుంచి అప్డేట్స్ ఇచ్చి ఫాన్స్ ను ఖుషీ చేశారు మేకర్స్. ఇప్పటికే ఉదయం హరిహర వీరమల నుంచి పోస్టర్ రిలీజ్ అవ్వగా.. ఓజీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
Nandamuri Balakrishna: మాస్ కా దాస్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..
కోలీవుడ్లో విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు ఉస్తాద్ రీమేక్ గా తెరకెక్కుతుంది. గతేడాది పవన్ బర్త్ డేకి ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఇక ఈసారి హరీష్ కేవలం పోస్టర్ తోనే సరిపెట్టాడు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. లుంగీ కట్టుకుని ఒక దిమ్మ మీద కూర్చుని చేతిలో రక్తం అంటిన కత్తిని సీరియస్ లుక్ లో చూస్తూ కనిపించాడు. ఇక వెనుక ముస్లిం గ్యాంగ్ ఆయనను చూస్తూ ఉండడం విశేషం. ఇక దీనికి క్యాప్షన్ గా ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటూరాసుకొచ్చారు. అంటే ధర్మసంస్థాపన చేయడానికి చెప్పకనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ చిత్రంతో హరీష్ పవన్ మరో హిట్ ను అందుకుంటారేమో చూడాలి.