Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: ఓరీ మీ దుంపలు తెగ.. సడెన్ గా చూసి నిజమే అనుకున్నాం కదరా బాబు

Pawan

Pawan

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మూవీ తేరి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నా.. కథాకథనాలు మొత్తం పవన్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడట హరీష్ శంకర్. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక పవన్ ఈ చిత్రం కోసం బాగానే డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ తమ కళకు పదునుపెడుతున్నారు. పవన్ ఫోటోలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పోస్టర్ అంటూ ఎడిట్ లు చేస్తున్నారు.

Jyotika: సూర్య భార్య ఇంత ఘోరంగా అవి చేయడానికి కారణం ఏంటో..?

నిజం చెప్పాలంటే.. కొన్నిసార్లు మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ల కంటే.. అభిమానులు ఎడిట్ చేసిన పోస్టర్లే.. అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక తాజగా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మే 11 న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఒక అభిమాని ఎడిట్ చేసిన పోస్టర్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది. మేకర్స్ సైతం పొరపాటున మేమే రిలీజ్ చేశామా అని డౌట్ కూడా పడొచ్చు.. అలా ఉంది పోస్టర్. పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. గబ్బర్ సింగ్ లుక్ లానే కనిపిస్తున్నా.. కొద్దిగా గెడ్డంతో పవన్ కనిపిస్తున్నాడు. సడెన్ గా ఈ పోస్టర్ చూసిన అభిమానులు తడబడి.. ఓరీ మీ దుంపలు తెగ.. సడెన్ గా చూసి నిజమే అనుకున్నాం కదరా బాబు అని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అకౌంట్ ను చెక్ చేసేస్తున్నారు. అందులో లేకపోవడంతో ఇది ఫ్యాన్స్ ఎడిట్ అని అర్ధమవుతుంది. అందుకే ఊరికే అనలేదు .. పవన్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారు అని. ఏది ఏమైనా ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version