Site icon NTV Telugu

Ustaad Bhagat Singh : ఉస్తాద్ నుంచి భారీ అప్డేట్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్

Usthad

Usthad

Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్‌ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అయింది. అందుకే ఈ కాంబోలో మరో మూవీ అనడంతో హైప్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు భారీ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తున్నట్టు తెలిపింది మూవీ టీమ్.

Read Also : Keerthi Bhat : వాళ్ల లాగా పొట్టిబట్టలు వేసుకుంటేనే ఛాన్సులు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం

రేపు అనగా సెప్టెంబర్ 1 సోమవారం రోజు సాయంత్రం 4.45 గంటలకు మూవీ నుంచి ఫుల్ మీల్స్ అంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ పోస్టర్ ను వదిలింది. ఇందులో పవన్ టోపీ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే రేపు టీజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే ఫుల్ జోష్‌ రావడం పక్కా. అసలే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులోనూ పవన్ కల్యాణ్‌ పోలీస్ పాత్రలోనే కనిపిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు మైత్రీ మేకర్స్.

Read Also : Bhojpuri Actor : మహిళా అభిమాని బాడీపై స్టార్ నటుడి చెత్త కామెంట్లు..

Exit mobile version