Ustaad Bagath Singh: హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఇట్టే వైరల్ గా మారిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా సెట్ లో ఉన్న పవన్ ఫోటోలు కూడా నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
SK21: ఎన్నా .. తలైవా.. ఏమన్నా కాంబినేషనా
ఇక తాజాగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ తెలిపారు.. గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి మే 11 కు గబ్బర్ సింగ్ వచ్చి 11 ఇయర్స్ కావడంతో.. ఆరోజును పురస్కరించుకొని.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ముందు నుంచి కూడా మే 11 న ఉస్తాద్ అప్డేట్ వస్తుందని అభిమానులు.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే. అనుకున్నట్లుగానే ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. మరి ఈ ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలంటే.. మే 11 వరకు ఆగాల్సిందే.
Yessss we are on the Job 🔥🔥 https://t.co/SYR27xTeaq
— Harish Shankar .S (@harish2you) May 5, 2023