Site icon NTV Telugu

Waltair Veerayya: మెగాస్టార్ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్!

Orvasi

Orvasi

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రెజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్‌ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలాపై మెగాస్టార్ తో కలిసి ఓ మాస్ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఊర్వశీ రౌతేలా కు ఇటీవల టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఆమె ‘బ్లాక్ రోజ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. అలానే రామ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ తాజా ఆఫర్ తో టాలీవుడ్ నిర్మాతలందరి దృష్టీ ఊర్వశీ రౌతేలాపై పడింది.

లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా ఇది ఉండబోతోంది. శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి దర్శకుడు బాబీ కథ, మాటలు సమకూర్చుకున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించారు. ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతి కానుకగా జనం ముందుకు రానుంది.

Exit mobile version