NTV Telugu Site icon

Urvashi Rautela: ఊర్వశిని వదిలేట్టు లేరు.. ఐదో ఐటెం సాంగ్ కూడా రెడీ?

Urvashi Rautela

Urvashi Rautela

Urvashi Rautela signed her fifth Telugu item song: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటన కంటే ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం ఉన్నా ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైన ఊర్వశి రౌతేలా చిరంజీవి పక్కన అదిరిపోయే స్టెప్స్ వేసి అందరికీ దగ్గరయింది. ఊహించినట్టుగానే ఊర్వశి వరుస టాలీవుడ్ అవకాశాలతో దుసుకుపోతుంది అయితే ఆమె బిజీ అవుతోంది హీరోయిన్ గా కాదు కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే. నిజానికి ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయడం ఆమె పర్సనల్ గా ఇష్టపడుతోంది అని తెలుస్తోంది.

Nandamuri Mokshagna: శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు.. మతలబు క్యా హై ..?

ఎందుకంటే హీరోయిన్స్ కు ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కూడా ఒక ఐటెం భామలకు ఇచ్చే పారితోషికం అధికంగా ఉంటుందని అంటున్నారు. ఆమెకు బాలీవుడ్‌లో కంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ఆమె ఇటీవల రామ్ పోతినేని “స్కంద” లో “కల్ట్ మామా” ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయినా ఊర్వశి రౌతేలా కొత్త ఆఫర్లను అందుకుంటుంది. త్వరలో ఓ బడా తెలుగు సినిమా కోసం ఐటెం సాంగ్ చేయడానికి ఊర్వశిని సంప్రదించినట్లు సమాచారం. ఆమె పేరును త్వరలోనే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు ఆమె తెలుగు సినిమాలైన “వాల్టెయిర్ వీరయ్య,” “ఏజెంట్,” “బ్రో”, స్కంద వంటి నాలుగు ఐటెం సాంగ్స్ చేసింది. ఆమె ఐదవ ఐటమ్ సాంగ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.