గానకోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన స్నాగతి తెలిసిందే. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. అయితే లతాజీ అంత్యక్రియల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన పని ప్రశంసలను, విమర్శలను కూడా అందుకొంటుంది. లతాజీ భౌతికకాయం వద్ద షారుక్ ఉమ్మి వేసి ప్రార్థన చేసి నివాళులు అర్పించారు. దీంతో పలువురు హిందువులు దీన్ని తప్పు పట్టారు. మరికొందరు షారుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆయన తనదైన పద్దతిలో ఆమెకు నివాళి అర్పించారు అంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ సైతం షారుక్ కి సపోర్ట్ గా నిలిచింది. అంతేకాకుండా తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లపై మండిపడింది కూడా.. ” ప్రార్ధనను కూడా ఉమ్మి వేయడం అంటూ హేళన చేసే సమాజంలో బ్రతుకుతున్నామంటే అవమానకరంగా ఉంది.. సినీ పరిశ్రమను ఇండియా లెవెల్లో నిలబెట్టిన షారుక్ ని అలా అవమానించడం చాలా బాధాకరం. ఒక మాట అనేటప్పుడు ముందువెనుక అలోచించి మాట్లాడాలని ట్రోల్లర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
