Urfi Javed: బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ ఇంతా కాదు. ఆమె వేసుకొనే డ్రెస్సుల వలనే ఆమె ఫేమస్ అయ్యిపోయింది. చిరిగిన బట్టలు.. కాగితపు బట్టలు… పగిలిన గ్లాస్ ముక్కలతో, బికినీలతో అందాలను ఆరబోసి కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక అమ్మడిపై వచ్చే విమర్శలు అంతా ఇంత కాదు. ఇలాంటి బట్టలు వేసుకొనే బదులు పోర్న్ వీడియోలో నటించొచ్చు గా అని కొందరు.. అవకాశాల కోసం ఇంత దిగజారి ప్రయత్నించాలా అని మరికొందరు బహిరంగంగానే నోరు పారేసుకుంటున్నారు. అయితే అలాంటివేమీ తానూ పట్టించుకోనని, వీటి వలనే తనకు పేరు వచ్చిందని చెప్పుకొచ్చిన ఉర్ఫీ తాజాగా తనను ఒక అబ్బాయి లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది.
అతడి ఫోటోను షేర్ చేస్తూ ” ఈ వ్యక్తి నన్ను రెండేళ్లు గా వేధిస్తున్నాడు. నేను నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటోను తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి నాకు పంపించి తనతో సెక్స్ కు ఒప్పుకోకపోతే.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెడతాడనని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై నేను 14 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటివరకు వారు యాక్షన్ తీసుకోకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ముంబై పోలీసుల గురించి చాలా విన్నాను.. కానీ వారెందుకు ఈ వ్యక్తి విషయంలో ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఏదిఏమైనా ఈ వ్యక్తి సమాజానికి, ముఖ్యంగా ఆడవారికి చాలా ప్రమాదం. దయచేసి ఈసారైనా పోలీసులు ఇతడిపై చర్యలు తీసుకొంటారనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
