Urfi Javed: అబ్బాయిలు.. నేను చనిపోలేదు.. పూనమ్ కు సెటైర్ వేసిన ఉర్ఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed: నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రచారం చేసి ఎంత షాక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వికల్ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికే ఈ విధంగా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను చనిపోయానని తన మేనేజర్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించిన పూనం పాండే, ఆమె చెప్పగానే అందులో పోస్ట్ చేసిన మేనేజర్, ఈ ఇద్దరి మీద కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్ న్యూస్ నమ్మి ఆమె మరణానికి నివాళులు అర్పించిన వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఆమె మీద, ఆమె మేనేజర్ మీద కేసు నమోదు చేసి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మరో హాట్ బ్యూటీ.. పూనమ్ పై సెటైర్ వేస్తూ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వింత ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆమెనే. ఇక తాజాగా ఉర్ఫీ బెడ్ పై పడుకున్న ఫోటోను షేర్ చేస్తూ .. ” హాయ్ అబ్బాయిలు నేను చనిపోలేదు. హ్యాంగోవర్ గురించి అవగాహన కల్పిస్తున్నాను. మద్యపానం చేస్తున్నప్పుడు మొదటి రోజు మీరు బతుకున్నట్లు అనిపిస్తారు. ఎలాంటి అసౌకర్యానికి గురి కారు. కానీ, ఆ తరువాత రోజు మాత్రం మీరు చనిపోయినట్లుగానే కనిపిస్తారు. కానీ నిజంగా చనిపోరు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!