NTV Telugu Site icon

Upendra : టాలీవుడ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేసిన ఉపేంద్ర

Upendra

Upendra

టాలీవుడ్‌లో శాండిల్ వుడ్ రేంజ్ పెంచిన యాక్టర్ ఉపేంద్ర. ప్రయోగాత్మక సినిమాలతో ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్‌‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనలో సూపర్ యాక్టర్ ఉన్నాడు కానీ అంతకు మించిన స్పెషల్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి.   ఉపేంద్ర ఈసారి యుఐ అంటూ యునీక్ స్టోరీతో వస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో  నేడు  రిలీజ్ అయిన ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేసాడు ఉపేంద్ర. శాండిల్ వుడ్‌లోనే కాదు. సౌత్‌లోనే బిగ్గెస్ట్ మార్కెట్‌గా మారిన టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే  ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని తనలోని రైటర్ కమ్ డైరెక్టర్‌ను మరోసారి బయటకు తెస్తున్నాడు.

Also  Read : Saregamapa : సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం మన ఖమ్మంలో!

దాదాపు  పదేళ్ల తర్వాత యుఐతో దర్శకత్వ బాధ్యతలు తిరిగి చేపట్టాడు. ఉప్పీ 2 తర్వాత ఈ సినిమాతోనే మెగాఫోన్ టచ్ చేశాడు ఈ వర్సటైల్ యాక్టర్. అంతేకాదు ఈసారి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తనే అందిస్తూ సినిమాను తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు ప్రమోషన్లు కూడా విపరీతంగా చేసాడు. హీరోగా ఉపేంద్ర మార్క్ తెలుసు కానీ దర్శకుడిగా ఆయన రేంజ్ చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇవన్నీ కూడా క్లాసిక్ చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అందులో రెండు తెలుగు చిత్రాలు ఓంకారం, రా ఉన్నాయి. తనకు బ్లాక్ బస్టర్ హిట్ కావాలనుకున్నప్పుడల్లా తనలోని టాలెంట్ బయటకు తీస్తుంటాడు. మరీ ఈ రోజు రిలీజ్ అయిన యుఐ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.