NTV Telugu Site icon

Virupaksha: ‘విరూపాక్ష’ ఏ ఓటిటీలోకి రానుందో తెలుసా..?

Virupaksha

Virupaksha

Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు విరూపాక్షతో హిట్ అందుకున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కార్తీక్ దండు రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోపెట్టి థ్రిల్ చేసి సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ గోల్డెన్ లెగ్ ను కంటిన్యూ చేసింది. మొత్తానికి మెగా మేనల్లుడు వెన్నులో వణుకుపుట్టించే హిట్ ను అందించాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యింది.. కలక్షన్స్ లెక్క రేపటి నుంచి మొదలవుతుంది. ఆ తరువాత ఏంటి.. హా అదే ఓటిటీ. సినిమా ఎంత బాగున్నా నెల రోజుల తరువాత ఓటిటీకి రావాల్సిందే. ఇప్పుడు విరూపాక్ష ఓటిటీ హక్కులను దక్కించుకున్నది ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా హిట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది నెట్ ఫ్లిక్స్.

Akkineni Nagarjuna: అయ్యగారిని తండ్రిగారు లైట్ తీసుకుంటున్నారా..?

ఇక ఈ ఏడాది ఎన్ని సినిమాలు తమ ఓటిటీలో వస్తాయో ముంచే చెప్పేసింది. అందులో విరూపాక్ష కూడా ఉంది. టైటిల్ కార్డ్స్ లో నెట్ ఫ్లిక్స్ నేమ్ వేయడంతో అది కన్ఫర్మ్ అయ్యింది. అవును.. విరూపాక్ష డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి మాత్రం కొంత టైమ్ పట్టేలా ఉంది. నిజం చెప్పాలంటే.. సస్పెన్స్, హర్రర్ సినిమాలను థియేటర్ లో ఎంజాయ్ చేసినంత ఓటిటీలో ఎంజాయ్ చేయలేము. ఎలాగూ మంచి హిట్ టాక్ వచ్చింది. ఆ ఎంజాయ్ మెంట్ ను ఫీల్ అవ్వడానికి అభిమానులు థియేటర్ వైపే మొగ్గుచూపుతారు కాబట్టి నెల దాటాకా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సినిమా ఎన్ని రోజులకు ఓటిటీలో అడుగుపెడుతుందో చూడాలి.