NTV Telugu Site icon

Akanksha Dubey: హోటల్ గదిలో ఉరేసుకున్న నటి.. చివరగా ఆమెతో గడిపిందెవరు..?

Akanksha

Akanksha

Akanksha Dubey: భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే మార్చి 26న ఒక హోటల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె ఆత్మహత్య సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆకాంక్ష గురించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇక ఆకాంక్ష చనిపోయాక ఆమె తల్లి.. ఆమె ప్రియుడే ఆమెను హత్యచేసినట్లు ఆరోపించింది. ఆకాంక్ష, సమర్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. అతడు.. నిత్యం ఆమెను వేధిస్తూ ఉండేవాడని, నా కూతురు మరణించడానికి కారణం సమర్ సింగ్ నే అని ఆమె ఘాటు ఆరోపణలు చేసింది.. ఇక తల్లి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.

Anasuya: ఇలాంటి ట్వీట్స్ చేసి వారిని ఇంకా రెచ్చగొడుతున్నావ్.. ‘ఆంటీ’

ఇక ఈ నేపథ్యంలోనే ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది. హోటల్ గదిలో ఆకాంక్ష చనిపోకముందు ఎవరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె రూమ్ లో గుర్తుతెలియని వ్యక్తి 17 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆగంతకుడు ఎవరు..? అతడికి, ఆకాంక్ష ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా..? అని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఆత్మహత్యగా అనుకుంటున్న ఆకాంక్ష కేసు.. హత్య అని కొందరు అంటున్నారు. ఆమె దగ్గర ఎలాంటి సూసైడ్ నాట్ దొరకలేదు. ఉరి వేసుకోవడానికి ముందు ఆమెతో పాటు ఎవరో ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆకాంక్షను ఎవరో కావాలనే పకడ్బందీగా హత్యచేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆ ఆగంతుకుడు ఎవరు అనేది పోలీసులు త్వరలోనే చెప్తారేమో చూడాలి.

Show comments