Site icon NTV Telugu

Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ నుంచి రేపు బిగ్ అప్డేట్..

Allu Arjun Atlee

Allu Arjun Atlee

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీగా వీఎఫ్‌ ఎక్స్ ఇందులో వాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా మూవీ నుంచి బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రేపు మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఉండబోతుందని మూవీ టీమ్ ప్రకటించింది.

Read Also : Kannappa : ఓజీ, రాజాసాబ్ కంటే కన్నప్ప బడ్జెట్ పెద్దది..

తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో బంగారు కత్తి పట్టుకున్నట్టు బన్నీ చేయి కనిపిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు రివీల్ చేస్తామని తెలిపారు. కానీ దేనికి సంబంధించిన అప్డేట్ అనేది మాత్రం చెప్పలేదు. టైటిల్ ప్రకటిస్తారా లేదంటే ఇంకేదైనా అప్డేట్ ఉంటుందా అని రేపు తెలిసిపోతుంది. ప్రస్తుతానికి మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మొన్నటి వరకు అట్లీ చర్చలు జరిపారు. అలాగే కొందరు నటీనటులను కూడా తీసుకున్నట్టు సమాచారం.

కానీ ఎవరెవరిని తీసుకున్నారనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతానికి అంతా సస్పెన్స్. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీపిక పదుకొణెను తీసుకుంటున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఇది కూడా ఒక రకమైన సైన్స్ ఫిక్షన్ మూవీ అని అంటున్నారు. మరి ఇంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న మూవీ.. రేపు ఎలాంటి అప్డేట్ ఇస్తుందో చూడాలి.

Read Also : Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్‌ హీరోయిన్..

Exit mobile version