RRR కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సినీ ప్రేమికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి నుంచి దేశవ్యాప్తంగా RRR మేనియా కన్పిస్తోంది. డప్పులు, టపాసులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఈ నాలుగేళ్ళ నిరీక్షణను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పెయిడ్ ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంచనాలను అందుకోవడంలో RRR టీం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంపై అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన చెర్రీ సతీమణి ఉపాసన థియేటర్లో సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసింది. ఏకంగా పేపర్స్ వెదజల్లుతూ ఒక సాధారణ ప్రేక్షకురాలిలా ఆమె సినిమాను ఎంజాయ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
