Site icon NTV Telugu

Ram Chran: దోసెలు వేసిన చరణ్.. అంతా ఆమె ట్రైనింగ్ అన్న ఉపాసన

Upasana

Upasana

Ram Chran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా.. ఇంకా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే ఉంది. మధ్యలో శంకర్.. ఇండియన్ 2 కు షిఫ్ట్ అవ్వడంతో చరణ్ కు గ్యాప్ వచ్చింది. ఇక ఈ గ్యాప్ ను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి వాడేస్తున్నాడు చరణ్. తన గారాల పట్టి క్లింకారతో సమయాన్ని గడుపుతున్నాడు. చరణ్ గురించి అందరికి తెల్సిందే. అయితే సినిమా.. లేకపోతే ఉపాసన.. అతనికి ఉన్న రెండే రెండు అలవాట్లు. షూటింగ్ లో ఉన్నా కూడా ఏ కొంచెం గ్యాప్ వచ్చినా ఉపాసనతో వెకేషన్ కు వెళ్ళిపోతాడు. నిజం చెప్పాలంటే.. చరణ్, ఉపాసన ల బంధం చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇద్దరికీ ఇద్దరు సపోర్ట్ చేసుకుంటారు.

చరణ్ అయితే గ్రీన్ ఫ్లాగ్ హస్బెండ్ అని చెప్పొచ్చు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా.. ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తాడు.. బట్టలు ఆరేస్తాడు.. ఉపాసనకు కావాల్సిన వంటలు చేసి పెడతాడు. ముఖ్యంగా ఉపాసన కు ఏది కావాలంటే అది క్షణాల్లో ముందు ఉంచుతాడు. ఇక ఇందుకు సంబందించిన వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంటూ మిస్టర్. సి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతున్న విషయం తెల్సిందే. ఈ సంబురాల్లో భాగంగా నేడు భోగి మంటలు వేసి.. హైపైగా కుటుంబమంతా ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా చరణ్.. అందరికీ దోసెలు వేసి షాక్ ఇచ్చాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఉపాసన.. ఫన్నీ క్యాప్షన్ ఇచ్చి షాక్ ఇచ్చింది. గుడ్ ట్రైనింగ్ అత్తమ్మ అంటూ చరణ్ ను ఆట పట్టించింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వదినమ్మ క్యాప్షన్స్ అదిరిపోయాయి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version