Upasana Konidela: ఆ వీడియోను పూర్తిగా చూడాలంటున్న ఉపాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు స్పందించారు. నిజానికి చెర్రీ, ఉపాసన ఇద్దరివైపూ ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నవారే. కానీ జనాభా నియంత్రణ కోసమే తాము పిల్లలు వద్దనుకున్నామని ఉపాసన చెప్పినట్టు ఓ వార్త షికారు చేస్తోంది. ఈ మధ్య సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగానే ఉపాసన ‘తాము పిల్లలు వద్దనుకున్నామని’ చెప్పినట్టు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన ఉపాసన ‘ఓ మై గాడ్… ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన అభిప్రాయమేమిటో తెలియాలంటే పూర్తి వీడియో చూడాలి’ అంటూ సూచించారు. కానీ జనం మాత్రం పదేళ్ళయినా రామ్ చరణ్, ఉపాసనకు పిల్లలు కలగక పోవడంపై ఎవరికి తోచింది వారు చాటింపు వేస్తూనే ఉన్నారు.
ఉపాసన చెప్పినట్టు వీడియో చూస్తే ఆ వీడియోలో.. తాను తన భర్తతో కలసి పదేళ్ళుగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నానని, అయినా ఎందుకని జనం తన ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి చర్చించుకుంటున్నారని ఆమె సద్గురు చెంత తన సందేహం వ్యక్తం చేశారు. ఆమె చెప్పిన ట్రిపుల్ ఆర్ లో మొదటిది ‘రిలేషన్ షిప్’, రెండవది ‘ఎబిలిటీ టు రిప్రొడ్యూస్’, మూడవది ‘రోల్ ఇన్ లైఫ్’. జనాభా నియంత్రణ చేస్తే దేశానికి మంచిదని సద్గురు బోధించారు. భవిష్యత్‌లో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయనీ, పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు అందులో అన్నారు. అందువల్ల జనాభా నియంత్రణ కోసం ఆరోగ్యంగా ఉన్నా పిల్లలు వద్దనుకొనేవారిని అభినందించాల్సిందే అనీ ఆయన చెప్పారు. అంతే తప్ప ఆయన మాటలు విని ఉపాసన తాము పిల్లలు వద్దనుకుంటున్నామని ఎక్కడా చెప్పలేదు.
Also Read
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని

తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!