Site icon NTV Telugu

Upasana Konidela: ఆ వీడియోను పూర్తిగా చూడాలంటున్న ఉపాసన

Upasana Konidela

Upasana Konidela

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు స్పందించారు. నిజానికి చెర్రీ, ఉపాసన ఇద్దరివైపూ ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నవారే. కానీ జనాభా నియంత్రణ కోసమే తాము పిల్లలు వద్దనుకున్నామని ఉపాసన చెప్పినట్టు ఓ వార్త షికారు చేస్తోంది. ఈ మధ్య సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగానే ఉపాసన ‘తాము పిల్లలు వద్దనుకున్నామని’ చెప్పినట్టు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన ఉపాసన ‘ఓ మై గాడ్… ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన అభిప్రాయమేమిటో తెలియాలంటే పూర్తి వీడియో చూడాలి’ అంటూ సూచించారు. కానీ జనం మాత్రం పదేళ్ళయినా రామ్ చరణ్, ఉపాసనకు పిల్లలు కలగక పోవడంపై ఎవరికి తోచింది వారు చాటింపు వేస్తూనే ఉన్నారు.

ఉపాసన చెప్పినట్టు వీడియో చూస్తే ఆ వీడియోలో.. తాను తన భర్తతో కలసి పదేళ్ళుగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నానని, అయినా ఎందుకని జనం తన ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి చర్చించుకుంటున్నారని ఆమె సద్గురు చెంత తన సందేహం వ్యక్తం చేశారు. ఆమె చెప్పిన ట్రిపుల్ ఆర్ లో మొదటిది ‘రిలేషన్ షిప్’, రెండవది ‘ఎబిలిటీ టు రిప్రొడ్యూస్’, మూడవది ‘రోల్ ఇన్ లైఫ్’. జనాభా నియంత్రణ చేస్తే దేశానికి మంచిదని సద్గురు బోధించారు. భవిష్యత్‌లో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయనీ, పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు అందులో అన్నారు. అందువల్ల జనాభా నియంత్రణ కోసం ఆరోగ్యంగా ఉన్నా పిల్లలు వద్దనుకొనేవారిని అభినందించాల్సిందే అనీ ఆయన చెప్పారు. అంతే తప్ప ఆయన మాటలు విని ఉపాసన తాము పిల్లలు వద్దనుకుంటున్నామని ఎక్కడా చెప్పలేదు.

Exit mobile version