Site icon NTV Telugu

ఉపాసన వరలక్ష్మీ వ్రతం… నాలుగు తరాలు ఒకే పిక్ లో…!

Upasana performs Varalakshmi Vratam

మెగా స్టార్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేశారు. చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కుటంబంలోని నాలుగు తరాల మహిళలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి భార్య, ఆయన తల్లి అంజనా దేవి, ఉపాసన, శ్రీజ కుమార్తె కూడా ఉన్నారు. “నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాము” అంటూ ఉపాసన ఈ పిక్ ను షేర్ చేసింది. “వరలక్ష్మీ వ్రతం”ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సాంప్రదాయ పూజా విధానంతో భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా పెళ్ళైన మహిళలు వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం ప్రతి రెండవ శుక్రవారం జరిగే ఈ పూజలో తప్పకుండా పాల్గొంటారు.

Read Also : మెగా సంబరాలు స్టార్ట్

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. చిరంజీవి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న “ఆచార్య” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. “లూసిఫర్”, “వేదాళం” రీమేక్‌ లలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రేపు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మెగా అభినులను సర్ప్రైజ్ చేయబోతున్నాయి.

Exit mobile version