NTV Telugu Site icon

Upasana Konidela: భార్య ఒడిలో కూర్చొని గ్లోబల్ స్టార్ నవ్వులు.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పిక్

Upasana

Upasana

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు చరణ్ బర్త్ డే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, అభిమానులు. అందరూ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక చరణ్ భార్య ఉపాసన ట్వీట్ కోసమే ఉదయం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆమె తన భర్తకు ఏ విధంగా శుభాకాంక్షలు చెప్తుందో అని ఆత్రుతగా చూస్తున్నారు. ఎందుకంటే.. చరణ్ క్రేజీ స్టఫ్ మొత్తం ఆమె ఫోన్ లోనే ఉంటాయి. మిస్టర్ సి యొక్క అద్భుతమైన ఫోటోలను అందరం చూసే ఉంటాం కానీ.. ఆయన రేర్ ఫొటోస్ కావాలంటే ఉపాసననే పోస్ట్ చేయాలి. ఇక తాజాగా అభిమానులందరు అనుకుంటున్నట్లుగానే ఉపాసన.. భర్త చరణ్ కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది.

Niharika Konidela: చమ్కీల చీరకట్టి.. మెగా డాటర్ మెరిసిపోతుందిలా

రెండు కక్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బెస్టీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక మొదటి ఫొటోలో గ్రీన్ కలర్ డ్రెస్ లలో చరణ్ వెనుక ఉపాసన ఉండగా.. రెండో ఫొటోలో ఉపాసన ఒడిలో కూర్చొని చరణ్ నవ్వులు చిందిస్తున్నాడు. చరణ్- ఉపాసన మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తరువాత వీరిద్దరూ ప్రేమలో పాడడం, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరి పెళ్లి అయ్యి పదేళ్లు అయ్యింది. గతేడాది ఈ జంట అభిమానులకీ గుడ్ న్యూస్ తెలిపింది. ఉపాసన ప్రస్తుతం 6 నెలల గర్భవతి. త్వరలోనే మెగా కుటుంబంలో మెగా వారసుడు రానున్నాడు. చరణ్ పుట్టినరోజుకే ఇంత హడావిడి చేస్తే మెగా వారసుడు ఇంట అడుగుపెట్టిన రోజున మెగా కుటుంబానికే కాదు మెగా ఫ్యాన్స్ కు కూడా పండుగే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments