NTV Telugu Site icon

Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు

Charan

Charan

Upasana Konidela:మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది. ఇక త్వరలోనే తల్లి అనే బాధ్యతను అందుకోనుంది. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. పదేళ్ల తరువాత ఉపాసన, చరణ్ పేరెంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తల్లి కాబోతున్న ఉపాసనను చరణ్ ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడం లేదు. ఎక్కడకు వెళ్లినా తనతోపాటు భార్యను తీసుకెళ్తూ.. ఏది కావాలంటే అది చేస్తూ పర్ఫెక్ట్ హస్బెండ్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇన్ని ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన చరణ్ ను పెళ్లాడిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాడీ షేమింగ్ కు గురైంది. అయినా ఉపాసన ఎక్కడా రాజీపడలేదు. వాటిని ఏవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటూ అందరి మన్ననలు పొందింది. కానీ, ఆ అవమానాలను మాత్రం మర్చిపోలేదని చెప్తుంది ఉపాసన.

Ravi Kishan: నగ్మాతో ఎఫైర్.. ఎట్టకేలకు నోరు విప్పిన ‘రేసుగుర్రం’ విలన్

ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అవమానాలను ఏకరువు పెట్టింది. “చరణ్, నేను.. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. ఆ తరువాత మా స్నేహం ప్రేమగా మారింది.. ప్రేమ, పెళ్ళివైపు అడుగులువేసింది. చిన్నతనం నుంచి నేను ఇంట్లో కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఇక పెళ్లి తరువాత నన్ను చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందంగా లేదని, లావుగా ఉన్నాను అని కామెంట్స్ చేశారు. చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు. అవన్నీ విని నేను కుంగిపోలేదు. దైర్యంగా నిలబడ్డాను. వారిని ఎదుర్కొన్నాను. అప్పుడు ట్రోల్స్ చేసినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments