NTV Telugu Site icon

Ram Charan: స్టార్ అయినా.. మెగా పవర్ స్టార్ అయినా భార్య బ్యాగ్ లు మోయాల్సిందే

Charan

Charan

Ram Charan: ఎంత వారు కానీ, వేదాంతులైన కానీ, వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్.. కైపులో.. అనే సాంగ్ వినే ఉంటారు.. ఎంత పెద్ద స్టార్లు అయినా భార్య ముందు తలా వంచాల్సిందే. ఆమె చెప్పిన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికలన్నీ తీర్చాల్సిందే. ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియా హీరోగా, మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ రేంజ్ వేరు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో చిత్ర బృందం మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సినిమాల్లో ఎంత వైలెంట్ గా ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం చరణ్ చాలా కూల్.. ముఖ్యంగా ఉపాసన విషయంలో అయితే చరణ్ మరింత కూల్.. కొంచెం సమయం చిక్కినా భార్యతో పాటు వెకేషన్ కు వెళ్ళిపోతాడు. ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కోరికలను దగ్గర ఉండి తీరుస్తున్నాడు.

Darshan: రాజమౌళి ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్ ఏం కాదు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

ఇక ఈ జంట తాజాగా అమెరికాలో సందడి చేస్తున్నారు. ఉపాసన తన బకెట్ లిస్ట్ మొత్తాన్ని చరణ్ ముందు పెట్టేయడంతో వాటన్నింటిని చరణ్ నెరవేర్చాడు. చరణ్ తో కలిసి తిరిగిన ప్రదేశాలను అన్ని ఒక వీడియో ద్వారా ఉపాసన అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో చరణ్ ను షాపింగ్ కు తీసుకెళ్లింది.. తనకిష్టమైన ఫుడ్.. ఇష్టమైన ప్రదేశాలను అన్ని తిప్పించినట్లు చూపించింది. ఇక దీనికి మంచి క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది ఉపాసన. ” అన్ని హడావిడిల మధ్య మాతో.. చరణ్ సమయం ముగిసింది. హ్యాపీ హోలీ.. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు.. నాకు డాల్ఫీన్స్ ను చూపించినందుకు మిస్టర్. సి థాంక్స్.. నా బకెట్ లిస్ట్ నుంచి దాన్ని టిక్ చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఉపాసన షాపింగ్ బ్యాగ్స్ ను చరణ్ మోస్తూ నడుస్తుండగా.. ఉపాసన ఎంతో హుందాగా అతడి ముందు నడుస్తూ కనిపించింది. దీంతో నెటిజన్స్ అంతే.. అంతే.. ఎంతవారులైన కాంతా దాసులే అని కొందరు.. స్టార్ అయినా.. మెగా పవర్ స్టార్ అయినా భార్య బ్యాగ్ లు మోయాల్సిందే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.