బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పెప్పి సాంగ్స్ కు పెట్టిండు పేరు కనికా.. ఇక ఇటీవలే పుష్ప హిందీ వెర్షన్ లో ఊ బోలేగా.. ఊఊ బోలేగా అంటూ ప్రేక్షలుకులను ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ తాజాగా రెండోసారి పెళ్లి కూతురుగా మారింది. 1998లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న కనికా రెండో పెళ్లి వేడుకలు లండన్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. లండన్‌కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని కనికా పెళ్లాడింది. ఇక ఈ వేదూకాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది మెగా కోడలు ఉపాసన.
కనికా పెళ్ళికి హాజరైన ఉపాసన పెళ్లి వేడుకల్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసనకు, కనికా స్నేహితురాలు. వీరి స్నేహం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీంతో కనికా పెళ్ళికి ఉపసాన హాజరు అయ్యినట్లు తెలుస్తోంది. ఇకపోతే కనికా ప్రస్తుతం పలు ఆల్బమ్స్ కోసం పాడుతోంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో ఈ పెళ్లిపై ఆమెను కొంతమంది విమర్శిస్తుండగా.. మరికొందరు కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.
