NTV Telugu Site icon

Ajith Kumar : అప్పటి వరకు సినిమాల్లో నటించను

Ajith

Ajith

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కూడా త్రిషా నే హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి ‘విదాముయార్చి’ పొంగల్ కానుకగా జానవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్.

Also Read : Venky : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రన్‌టైమ్ లాక్

అయితే తాజాగా అజిత్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఫ్యాన్స్ ను నిరుత్సహ పరిచింది.  అజిత్ కి సినిమాలకంటే ఎక్కువగా రేసింగ్ అంటే ఇష్టం అని గతంలో అనేక సార్లు చెప్పారు. తాజగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజెంట్ నేను ఇంటర్నేషనల్‌ కార్‌ రేసింగ్‌ పోటీలు లో పాల్గోంటున్నాను. అది ముగిసేవరకు సినిమాల్లో నటించను. 18వ యేట నుంచి రేసింగ్‌ పోటీల్లో పాల్గొంటున్నాను. సినిమా షూటింగ్ కారణంగా ఈ రేసింగ్‌ పోటీల్లో  పాల్గొనడం వీలుపడం లేదు. వచ్చే సెప్టెంబరులో కార్‌ రేసింగ్‌ పోటీలు జరుగనున్నాయి. అందుకే అప్పటి వరకు సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాను’ అని అన్నారు. తమ హీరో సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Show comments