Unstoppble 2: గతవారం అన్ స్టాపబుల్ లో ప్రభాస్, గోపీచంద్ తో సందడి చేసిన బాలయ్య ఈ వారం వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ఈ చిత్ర బృందం మొత్తం బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నిర్మాతలు అందరూ ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ కొద్దిసేపటి క్రితం రిలీవుజ్ చేశారు.
సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన అన్ స్టాపబుల్ అంటూ మొదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంది. వరలక్ష్మీ విలన్ గా చేస్తున్న సినిమాలో నేను హీరోనా.. లేక నేను చేస్తున్న సినిమాలో వర విలనా అని ఆమెను ఆటపట్టించాడు బాలయ్య. నేనే హైపర్ అంటే మీరు నాకన్నా హైపర్ గా ఉన్నారంటూ వరలక్ష్మీ పంచ్ లు వేసింది. ఇక ఒకరి తరువాత ఒకరు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికి దునియా విజయ్ వచ్చి సెట్ పై వీరసింహారెడ్డి డైలాగ్ తో అలరించాడు. ఆ తరువాత లైన్ గా హనీ రోజ్, నిర్మాతలు వచ్చారు. హాని రోజ్ ను బాలయ్య తనదైన స్టైల్లో టీజ్ చేశాడు. ఇక చివర్లో గోపీచంద్ మలినేని గతం గురించి అడిగి ఆయన ఎమోషనల్ అయ్యేలా చేశాడు. క్రాక్ కు ముందు ఏడాదిన్నర స్ట్రగుల్ అయ్యావ్.. ప్రాపర్టీ కూడా అమ్మేసినట్లు తెల్సింది. ఆ సమయంలో ఎలా అనిపించింది అని అడుగగా.. మనుషులు అంటూ గోపీచంద్ మొదలుపెట్టి కంటనీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.ఇకపోతే ఈ ఎపిసోడ్ జనవరి 13 ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.
https://www.youtube.com/watch?v=bCQ5zMb2Txo
