Site icon NTV Telugu

Unstoppable With NBK : ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు

Unstoppable With NBK

Unstoppable With NBK

నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినా సరే ఆయన ఆహా కోసం చేస్తున్న ఒరిజినల్ తెలుగు సెలబ్రిటీ గెస్ట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ ఈ మధ్యనే లాంచింగ్ అయింది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నందమూరి బాలకృష్ణ పలు ప్రశ్నలు సంధించారు. ఇక దానికి సంబంధించిన మొదటి ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది

Also Read: Lubber Pandhu : తెలుగులోకి తమిళ్ సూపర్ హిట్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఇక నుంచి జరిగే బాలయ్య పండుగ ఆహా అన్ స్టాపబుల్, మా బావ గారు మీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కక్షా రాజకీయాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నేను మాత్రం లక్ష్మణ్ రేఖ దాటను తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. ఇక ఆకాశంలో సూర్య చంద్రులు ఆంధ్రప్రదేశ్లో బాబు గారు కళ్యాణ్ బాబు అంటున్నారు అంటూ బాలకృష్ణ పేర్కొనడంతో చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. మీరు ఎలా అయితే అన్ స్టాపబుల్ గా ఉన్నారో మేము కూడా రాజకీయాల్లో అలాగే అన్ స్టాపబుల్ గా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version