NTV Telugu Site icon

Unstoppable 2: బాలయ్యా మజాకానా.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ప్రోమో

Nbk

Nbk

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ లో ప్రసారం అయిన ఈ షో సీజన్ 1 ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరికొద్దిరోజుల్లో సీజన్ 2 కూడా రాబోతుందన్న విషయం విదితమే. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఇక తాజాగా సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ నెంబర్ 1 లో దూసుకుపోతోంది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు తో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రాజకీయాలు, సినిమాలు, అల్లరి, కుటుంబం ఇలా అన్ని ఒక్క ప్రోమోలోనే చూపించారు. ముఖ్యంగా నారా లోకేష్ తో బాలయ్య చేసిన కామెడీ అదుర్స్ అని చెప్పాలి. ఇక చంద్రబాబు, బాలయ్య ల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఈ ప్రోమో చూస్తుంటే అర్ధమవుతోంది. ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలను రేకెత్తించారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 14 న స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ బావాబామ్మర్దుల ఫన్నీ పంచులు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.