సూపర్ హిట్ షో ‘అన్‌స్టాపబుల్’తో మొదటి సారి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య కామెడీ టైమింగ్, స్పాంటేనిటీతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు బాలయ్య. ‘అన్‌స్టాపబుల్ సీజన్ 1’ ఇప్పటికే పూర్తయ్యింది. చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా పాల్గొనగా, ఇటీవలే ఆ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఇప్పుడు మేకర్స్ ‘అన్‌స్టాపబుల్’ను మిస్ అవుతున్నామని భావిస్తున్న వీక్షకుల కోసం ఓ ప్రత్యేక ప్లాన్ వేశారు. బాలయ్యతో ‘నెవెర్ ఎవర్ ఐ హావ్’ అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంతవరకూ హోస్ట్ గా వ్యవహరించిన బాలయ్య ఇప్పుడు తానే అతిథిగా మారిపోయారు.
Read Also : Brahmastra : రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?
బాలయ్య ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’ అనే ఆసక్తికరమైన గేమ్ లో పలు సరదా విషయాలను వెల్లడించారు. ఈ వీడియోలో బాలకృష్ణ ఒక సూపర్ స్టైలిష్ షర్ట్, ఏవియేటర్స్, క్యాప్ ధరించి స్టైలిష్ గా కన్పించారు. ఇక గేమ్ విషయానికొస్తే బాలయ్య చేతిలో ఓ బోర్డ్ ఉంటుంది. దానికి ఒకవైపు నెవర్, మరోవైపు ఐ హావ్ అని ఉంటుంది. ఇక బాలయ్యను ప్రశ్నలు అడగ్గా, ఆయన చేయకపోతే నెవెర్ అని, చేస్తే ఐ హావ్ అని చూపించాలి. ఈ ఆహ్లాదకరమైన గేమ్ కు సంబంధించిన ఎపిసోడ్ ను ‘ఆహా’లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రసారం చేయనున్నారు. మరోవైపు ‘అన్‌స్టాపబుల్ 2’కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.