మాన్ ఆఫ్ మాసెస్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయక్తంగా నిర్మిస్తున్నఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ బుధవారం ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా డ్రాగన్ గ్లిమ్స్ రాబోతుంది. ఈ అప్డేట్ ఇప్పడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్‌వర్క్స్ ఎక్కడ చూసినా, ఏ ప్లాట్‌ఫామ్‌పై చూసినా ఎన్టీఆర్ పేరే మార్మోగిపోతోంది. చాలా రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసిన నందమూరి అభిమానులకు గ్లిమ్స్ రిలీజ్ కాబోతుండడంతో సంబరాలు చేస్తున్నారు.
ఈ క్రేజీ కాంబోపై నెలకొన్న హైప్ టాలీవుడ్‌లో భారీ లెవల్‌లో ఉంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన ప్రశాంత్ నీల్ డార్క్ అండ్ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రపంచంలోకి ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ అడుగుపెడుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మేకర్స్ వదులుతున్న ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి 11.52గంటలకు రిలీజ్ కానున్న డ్రాగన్ చేయబోయే విధ్వంసం ఓ రేంజ్ లో ఉండబోతుందని తారక్ అభిమానులు క్రియేట్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఊపు కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఈ మాస్ తుఫాన్ మరింత ఉధృతంగా మారబోతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ బొమ్మ పడితే పూనకాలే అని ట్రేడ్ వర్గాలలో టాక్ నడుస్తుంది.
