మార్కో మాలీవుడ్ చరిత్రలో ఇలాంటి వయెలెంట్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఇది మాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న మాట. బాబోయ్ ఇదేం సినిమా రా బాబు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ ఎగబడి చూశారు జనం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అడ్వంచరెస్‌కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ వంద కోట్లను కట్టబెట్టారు. ఇప్పుడు మార్కో విషయంలో రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. కొంత మంది బ్యాడ్ హాబీట్స్‌కు గురి కావడంపై రీసెంట్లీ ఓ ఫంక్షన్‌లో సోషల్ మేసెజ్ ఇచ్చాడు. సినిమాలో సీన్స్ లిబర్టీతో చేసివని మీరు అలా చేయొద్దంటూ హితవు పలికాడు.
Also Read : Tourist Family : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు
ఇదే ఫంక్షన్‌లో తన అప్ కమింగ్ చిత్రాల విశేషాలను పంచుకున్నాడు ఈ మలయాళీ యాక్టర్. గంధర్వ జూనియర్ గురించి చెబుతూ ఇదొక ఫాంటసీ సూపర్ హీరో పిక్చర్ అని మునుపెన్నడు మలయాళ చిత్రపరిశ్రమలో ఇలాంటి సినిమాలు రాలేదని, అలాగే ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఈ తరహా కాన్సెప్ట్ పిక్చర్ వచ్చి ఉండకపోవచ్చునని అంటున్నాడు. ఇదే కాదు మలయాళం క్లాసిక్ మూవీ ప్రేమలు ఫేం ఆల్ఫాన్సో పుత్రేన్‌తో నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. చూడబోతే మార్కో తరహాలోనే పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నాడు మాలీవుడ్ హీరో. ఆల్ఫాన్సో పుత్రేన్ రీసెంట్ టైమ్స్‌లో ట్రెండీగా మారిన పేరు. రెట్రో ట్రైలర్ కట్ వచ్చాక వార్తల్లో నిలిచాడు ఈ ఫిల్మ్ మేకర్. కార్తీక్ సుబ్బరాజుకు మంచి ఫ్రెండైన ఆల్ఫాన్సో ప్రజెంట్ తమిళంలో గిఫ్ట్ అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాతే ఉన్ని ముకుందన్ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది.
