ప్రముఖ నటుడు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసింది. సరిగ్గా అదే సమయంలో అతను నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలైంది. అయితే చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరిన సాయిధరమ్ తేజ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేదు. చావు అంచువరకూ వెళ్లి తిరిగొచ్చిన సాయితేజ్ తను ఆరోగ్యం గురించి ఆరా తీసిన వాళ్ళకు ఆమధ్య కృతజ్ఞతలు తెలిపాడు. మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అప్పట్లో కోరుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం సాయిధరమ్ తేజ్ ఇంటికెళ్ళి పరామర్శించారు. ఆరోగ్య విషయమై ఆరా తీశారు. ఇందుకు కిషన్ రెడ్డికి సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపాడు. బిజీ షెడ్యూల్ లోనూ వీలు కల్పించుకుని కిషన్ రెడ్డి తన ఇంటికి వచ్చి పరామర్శించారని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ ను పరామర్శించిన కేంద్రమంత్రి

saidharam tej