Site icon NTV Telugu

జనవరి 26న ‘ఉనికి’ చాటబోతున్నారు!

uniki

‘నాటకం’ ఫేమ్‌ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రశుక్ల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ రూపొందించిన సినిమా ‘ఉనికి’. ఈ చిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు , అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు.

ఓ సామాన్య మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపు కోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్ర ప్రధానాంశం. రాజమండ్రి సబ్-కలెక్టర్ అంజలి అనుపమ గారిని చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అలాగని ఇదేమి ఆమె రియల్ స్టోరీ కాదు. ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగాను, ఆసక్తికరంగాను ఉంటుంది” అని చెప్పారు. టీఎన్నార్, నాగమహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన బాబీ ఏడిద కథను అందించారు.

https://youtu.be/gCzyIJVmCIw
Exit mobile version