NTV Telugu Site icon

Umapathy Ramaiah: స్టార్ హీరో కుతూర్ని లవ్లో పడేసి ఏకంగా హీరో అయిపోయిన కమెడియన్ కొడుకు

Pittala Mathi

Pittala Mathi

Umapathy Ramaiah Becomes hero with Pittala Matthi : కమెడియన్‌ తంబి రామయ్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయామ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన తమిళంలో స్టార్ కమెడియన్ అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ కూడా పరిచయమే. ఇక ఆయన కుమారుడు ఉమాపతి తంబిరామయ్య కూడా తమిళంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక అలా ఒక సినిమా షూట్ సమయంలో ఆయన స్టార్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం కూడా ఫిక్స్ అయింది. 2023లో వీరు వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా మారాడు. ఉమాపతి హీరోగా నటించిన తాజా చిత్రం పిత్తల మాత్తి. మాణిక్య విద్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ శరవణ ఫిలిం ఆర్ట్స్‌ పతాకంపై జి.శరవణన్‌ నిర్మించారు.

OTT News: అక్టోబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్

సంస్కృతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలశరవణన్, వినుతాలాల్, తంబి రామయ్య, దేవదర్శిని, విద్యుత్‌ లేఖారామన్, ఆడుగలం నరేన్, కాదల్‌ సుకుమార్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మోసస్‌ సంగీతాన్ని, ఎస్‌ఎన్‌ వెంకట్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమా ఈనెల 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా గురిఞ్చసి నిర్మాత శరవణన్‌ మాట్లాడుతూ ఒక యువకుడు మంచి కోసం ఏమేమి చేయాల్సి వచ్చింది వివరించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన అన్నారు. అతను ఏది మంచి ఏది చెడు తెలుసుకుని జీవితంలో పైకి రావడానికి ఏం చేశాడు అనే విషయాన్ని పలు ఆసక్తికరమైన సంఘటనలతో తెరకెక్కించామని ఈ సినిమాను ఈ నెల 28న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Show comments