Site icon NTV Telugu

Mouni Roy: ‘సీక్రెట్ ఎఫైర్స్.. డబ్బుకోసం వారితో..’

Mouni

Mouni

Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా మౌనీ సుపరిచితమే. ఇక గతేడాది రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రం సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. అందులో నెగటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోషూట్ లకు కుర్రాళ్ళు షేక్ అవుతున్నారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మపైన బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ సభ్యుడు అని చెప్పుకు తిరుగుతున్న ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేశాడు. గతేడాది ఆమె ప్రేమించిన సూరజ్ నంబియార్ ను వివాహమాడింది. పెళ్లి అయినా కూడా అమ్మడి అందాల ఆరబోత తగ్గింది లేదు.

Ram Charan: ప్రధాని మోడీతో చరణ్.. ఇది కదా మనకు కావాల్సిన మూమెంట్

ఇకపోతే నాగిని గురించి ఉమైర్ చాలా అంటే చాలా ఘాటు ఆరోపణలు చేశాడు. “డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో మౌనీ రాయ్ కు ఎన్నో సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయి. ఆమె డబ్బు కోసం ఏదైనా చేస్తోంది.” అటు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని బాలీవుడ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసి మౌనీ కెరీర్ ను నాశనం చేయాలనుకుంటున్నావా ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. లైక్స్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టించి ట్విట్టర్ ను బ్రష్టు పట్టిస్తున్నాడని, ఇతడిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇకపోతే ఈ ఆరోపణలపై మౌనీ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Exit mobile version