NTV Telugu Site icon

Dulquer Salmaan: దుల్కర్ కు ఏమైంది.. అలాంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు.. ?

Dulwuer

Dulwuer

Dulquer Salmaan: మలయాళ స్టార్హీరో దుల్కర్ సల్మాన్ .. తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల పరంగానే కాదు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ అందరికి సుపరిచితమే. ఇక ప్రస్తుతం దుల్కర్.. కింగ్ ఆఫ్ కోతా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. పాన్ ఇండియా సినిమాగా త్వరలోనే కింగ్ ఆఫ్ కోతా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దుల్కర్.. ఓకే చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఆయన కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.

Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..

” మొట్ట మొదటిసారి నేను ఒక సంఘటన ఎదుర్కొన్నాను. అప్పటినుంచి పరిస్థితులు మొత్తం మారిపోయాయి.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. జరిగిన సంఘటన నా మైండ్ లో నుంచి పోవడం లేదు. ఈ సంఘటన గురించి ఇంకా నాకు చెప్పాలని ఉంది.. కానీ, చెప్పలేకపోతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దుల్కర్ కు ఏమైంది అని కామెంట్స్ పెడుతున్నారు. అంతలోనే దుల్కర్ ఆ వీడియోను డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్సనల్ లైఫ్ లో ఏదైనా..? ఇంకేదైనా సమస్య ఎదురైందా..? అని కొందరు అంటుండగా.. ప్రమోషన్ స్టంట్ అని మరికొందరు అంటున్నారు. మరి ఈ వీడియోలో దుల్కర్ దేని గురించి చెప్పడానికి ప్రయత్నించాడు అనేది తెలియాలంటే.. దుల్కరే నోరు విప్పాలి.