NTV Telugu Site icon

Ukku Satyagraham: వైసీపీ ఎమ్మెల్యే కీలక పాత్రలో ఉక్కు సత్యాగ్రహం సినిమా.. ట్రైలర్ లాంచ్ చేసిన గద్దర్ కుమార్తె

Ukku Satyagraham Movie Trailer

Ukku Satyagraham Movie Trailer

Ukku Satyagraham Movie Trailer Launched: సత్య రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ట్రైలర్ – సాంగ్స్ ను గద్దర్ కుమార్తె వెన్నెల లాంచ్ చేశారు. ఇక లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మశ్రీ వంటి వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో లాంచ్ చేసిన అనంతరం గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ మా నాన్న గద్దర్ ప్రజల కోసం ఎంతో పాటు పడేవారని, ఆయన రాసిన పాటలు గాని గేయాలు గాని అన్ని ప్రజల కోసము ప్రజల సమస్యల మీదనే ఉండేవని అన్నారు. కరోనా సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల్లోనే అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు, అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా ఆయన రాశారు పాడారు.

Ayyagaru: అఖిల్ ఫ్యాన్ బిరుదుతో సినిమా… ఆసక్తికరంగా గ్లింప్స్

అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాలను ఎక్కువగా నటించిన నాన్నగారు ఈ సినిమాలో పాటలు రాయడంతోపాటు నటించారని అన్నారు. విశాఖపట్నం (చోడవరం) ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగము చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని అన్నారు. విశాఖపట్నం ఉక్కు సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల వారు ఎంతో కృషి చేశారు, ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు అన్న దాని గురించి ఉక్కు సత్యాగ్రహంగా ఈ సినిమాను తీసుకురావడం చాలా మంచి విషయం అన్నారు. అలాగే రచయిత గాయకుడు నాయకుడు అయిన గద్దర్, ఈ సినిమాలో రెండు పాటల్లో నటించడం మాకు ధైర్యాన్ని మాకు ఇచ్చారని అన్నారు.