NTV Telugu Site icon

Allari Naresh: ‘ఉగ్రం’ తో మరో ‘నాంది’ని చూపించబోతున్నాడా..?

Ugram

Ugram

Allari Naresh: అల్లరి నరేష్.. కామెడీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన కథలను ఎంచుకొని నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ మధ్యనే ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నరేష్. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ, ఈసారి మాత్రం ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతో తనకు నాంది లాంటి హిట్ సినిమాను ఇచ్చిన విజయ్ కనకమేడలతో పాటు వస్తున్నాడు. విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాంది సినిమా చూశాకా ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంచనాలు ఏ మాత్రం తగ్గకుండానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 14న సమ్మర్ కానుకగా ఈ సినిమా రానున్నట్లు ఒక వీడియో ద్వారా తెలిపారు. వీడియోలో నరేష్ ఉగ్ర రూపంలో కనిపించాడు. బుల్లెట్ మీద వచ్చిన నరేష్ కిందకు దిగి తుపాకీ పట్టుకొని గట్టిగా అరుస్తూ కనిపించాడు. నరేష్ లుక్ ఫెరోషియస్ గా ఉంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం అదిరిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నరేష్.. మరో నాందిని చూపిస్తాడో లేదో చూడాలి.

Show comments