టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్న నటుడు నందు. చిన్న చిన్న క్యామియో రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగిన నందు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నందు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. నందు సరసన అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
‘భీమ్లా నాయక్’ ఫేమ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ఈ మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ప్రేమ అనే అందమైన భావన వెనుక దాగి ఉన్న ఓ చీకటి కోణాన్ని దర్శకుడు ఈ సినిమాలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన హీరో.. ఆమె వేరొకరిని ఇష్టపడుతోందని తెలుసుకుని ఎలాంటి సైకోయిజానికి పాల్పడ్డాడు అనేది ఈ సినిమా ప్రధానాంశం. తనకి దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదనే ఉద్దేశ్యంతో, హీరోయిన్‌ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆమెకు నరకం చూపిస్తున్నట్లు ట్రైలర్ కట్ ద్వారా చూపించారు. నటనకు ఆస్కారం ఉన్న ఇలాంటి నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేయడం నందుకు కొత్తేమీ కాదు. ఈ సినిమాలో సైకో లక్షణాలున్న యువకుడిగా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు, సాధారణ గృహిణిగా అవికా గోర్ చాలా నేచురల్‌గా కనిపించింది. భర్త పెట్టే టార్చర్ భరిస్తూనే.. ఆమె ఎందుకు మౌనంగా ఉండిపోయింది? అసలు హీరో సమస్య ఏంటి? అన్న ప్రశ్నలు ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ‘అగ్లీ స్టోరీ’ని మే 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
