NTV Telugu Site icon

Ugly Story: చిన్నారి పెళ్లికూతురితో గీతామాధురి భర్త అగ్లీ స్టోరీ

Ugly Story Thumb

Ugly Story Thumb

‘Ugly Story’ Movie Glimpse released : ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా మూవీ అగ్లీ స్టోరీ. లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్ లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ లక్కీ మీడియా రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న అగ్లీ స్టోరీ మూవీతో 2024లో హిట్టు కొట్టబోతున్నామని గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అన్నారు.

Devil: సలార్ సత్తా చూపాడు.. ఇక డెవిల్ కోసం వెయిటింగ్!

టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోందని, ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఎన్నో ఉండబోతున్నాయని అన్నారు. ఈ గ్లింప్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో ముందు ముందు వచ్చే టీజర్ ట్రైలర్ – సినిమాని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్నామన్న ఆయన అతి త్వరలో టీజర్, ట్రైలర్ తో మిమ్మల్ని కలుస్తామని అన్నారు. నందు, అవికా గోర్ లతో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా మరియు ప్రజ్ఞా నయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా D.O.Pగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా భాస్కరబట్ల, వరికుప్పల యాదగిరి, కడలి సాహిత్యం అందించారు.

Show comments