Udaya Bhanu: ఇప్పుడు యాంకర్ అనగానే ఎంతోమంది పేర్లు చదివేస్తారు.. కానీ, ఒకప్పుడు యాంకర్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది .. అదే ఉదయ భాను. చారడేసి కళ్ళు.. ఆరడుగుల అందాల బొమ్మ. చూడగానే అబ్బా అనిపించే అందమైన నగుమోము.. ఒకప్పుడు టీవీ పెడితే ఆమె తప్ప మరెవ్వరు కనిపించేవారు కాదు. ఇక అంత ఫేమస్ అయిన ఉదయభాను ఇప్పుడెక్కడుంది..? ఏం చేస్తుంది..? అసలు ఎందుకు కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది..? అనేది చాలామందికి తెలియదు. ఉదయభాను హీరోయిన్ అవ్వాలనుకుంది. దానికోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. నటిగా కొన్ని సినిమాల్లో కూడా కనిపించి మెప్పించింది కానీ, అమ్మడికి లక్ కలిసిరాలేదు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడి ఇండస్ట్రీకి దూరమయ్యింది. వీరి ప్రేమ అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. విజయ్ ను వివాహమాడడం ఉదయభాను తల్లికి ఇష్టం లేకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చి అతడిని వివాహమాడింది. ఉదయభానుకు ఇద్దరు పిల్లలు. ట్విన్స్.. భూమి ఆరాధ్య.. యువీ నక్షత్ర.
Naveen Polishetty: స్వీటీతో ఎవడీ క్యూటీ..
ఇక ఇండస్ట్రీకి దూరమైనా ఉదయభాను అభిమానులకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. మధ్యమధ్యలో అడపాదడపా ఇంటర్వ్యూలు. ఈవెంట్స్ కూడా చేస్తూ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉదయభాను తన మొత్తం సమయాన్ని యూట్యూబ్ కే అంకితం చేసింది. బుట్టబొమ్మ భోజనం పేరుతో ఫుడ్ వోల్గ్స్ చేస్తోంది. అచ్చ తెలుగు ఆడపడుచులా రెడీ అయ్యి.. తెలుగింటి వంటకాలను తెలుగువారికి సరికొత్త పద్దతిలో నేర్పిస్తుంది. ఆమె కట్టుబొట్టు, మాట్లాడే విధానంపై అభిమానులు ఫిదా అవుతున్నారు . మరికొంతమంది రీఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఉదయభాను అంతకుముందు కంటే ఇంకా అందంగా ఉందని మాత్రం నెటిజన్లు బల్లగుద్ది చెప్తున్నారు. మరి ముందు ముందు ఈ భామ ఏమైనా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.
