NTV Telugu Site icon

Dulquer: మలయాళ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా…

Dulquer

Dulquer

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి తెలుగులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేస్తుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమాలనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన స్టార్ హీరోల్లాగే దుల్కర్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. మహానటి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దుల్కర్ సల్మాన్, సీతా రామం సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రేమ కథలతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే దుల్కర్ కి అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. కనులు కనులని దోచాయంటే, కురూప్ సినిమాలతో కూడా తెలుగులో మంచి హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాకి సైన్ చేశాడు.

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్, దుల్కర్ తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. “ది ఉబెర్ కూల్ డీక్యూ ఈజ్ బ్యాక్” అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఒకప్పుడు ప్రేమ కథలతో సినిమాలు చేసి, ధనుష్ తో ‘సార్’ సినిమాతో తన పంథా మార్చాడు వెంకీ అట్లూరి. సార్ మూవీ తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యి, మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో మరోసారి వెంకీ అట్లూరితోనే సినిమా చెయ్యడానికి రెడీ అయిన నాగ వంశీ, వెంకీ అట్లూరి కోసం ఈసారి దుల్కర్ సల్మాన్ ని రంగం లోకి దించాడు. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2024 సమ్మర్ కి రిలీజ్ అవ్వనుంది. కంటెంట్ ని మాత్రమే నమ్మి సినిమా చేసే దుల్కర్, ‘సార్’ సినిమాతో తన పంథా మార్చిన వెంకీ అట్లూరి కలిసి ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తారు అనేది చూడాలి.