Site icon NTV Telugu

పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Pawan Kalyan to Play Police Officer role again in 'pspk28'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో నటిస్తున్నారు. కొన్ని వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా భాగం అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు.

Read Also : శ్రీదేవితో ఆమీర్ సినిమా చేయనన్నాడు! ఎందుకంటే…

ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా “పిఎస్పికే28” నుంచి కూడా సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను పవన్ బర్త్ డే ట్రీట్ గా రిలీజ్ చేయనున్నారట. హరీష్ శంకర్ ఈ పోస్టర్‌ను ఇప్పటికే లాక్ చేసారని అంటున్నారు. మెగా పవర్ ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి.

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచే ముఖ్యాంశాలలో ఒకటిగా నిలవనుంది. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version