NTV Telugu Site icon

Mechanic Rocky: ఆ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్

Mechanic Rocky

Mechanic Rocky

Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ చిత్రం విశ్వక్‌సేన్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంత‌రం విశ్వ‌క్ “మెకానిక్‌ రాకీ” అనే సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ లభించింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read: VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్‭ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..

అయితే తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రయాంగల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఫిమేల్ లీడ్ గా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొందరు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ మరియు విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.

Show comments